రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 47 మంది మృతి
భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీతో సహా వర్షబీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు సంభవించాయి. ఈ వర్షాల కారణంగా 47 మంది మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. బీహార్ రాష్ట్రం దారుణంగా మారింది. ఈ రాష్ట్రంలో పిడుగులు, వడగళ్ల కారణంగా బీహార్ లో 25 మంది మృతి చెందారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో కూడా వర్షం బీభత్సంగా కురిసింది. 15 జిల్లాల్లో పడిన వర్షం తాకిడికి 22 మంది మరణించారు. ఫతేపూర్, అజంగఢ్‌లో ముగ్గురు మరణించగా, ఫిరోజాబాద్, కాన్పూర్ దేహత్, సీతాపూర్‌లో ఇద్దరు చొప్పున, ఘాజీపూర్, గోండా, అమేథి, సంత్ కబీర్ నగర్, సిద్ధార్థ్ నగర్, బల్లియా, కన్నౌజ్, బారాబంకి, జౌన్‌పూర్, ఉన్నావ్‌లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
కాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. జార్ఖండ్ లోనూ భారీ వర్షం కురిసింది. ధన్‌బాద్, హజారీబాగ్, కోడెర్మ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పంట నష్టం వాటిల్లింది. డాల్టన్‌గంజ్‌లో 31.8 మి.మీ, రాంచీలో 7.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో పిగుడుపాటుకు నలుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు వృద్ధులు కూడా ఉన్నారు.