గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నిఘా..
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో తాజాగా 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తెలిసిందే. కాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. పోలీసులు, కలెక్టర్‌తో ప్రధాని మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 29న కొంత మంది యువకులతో సదరు బాదిత యువతి బయటకు వెళ్లింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా.. యువతిని గుర్తించినప్పుడు.. సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్ 6న గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం కంప్లైంట్ చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేరున్న వ్యక్తులపై, 11 మంది పేరులేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహైల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్‌లుగా గుర్తించారు. కాగా ఈ కేసుపై తదుపరి విచారణకు సంబంధించిన వివరాలు కూడా తనకు త్వరలోనే తెలియజేయాలని నరేంద్ర మోదీ అధికారులను కోరారు.