ఓటిటిలోకి ప్రియదర్శి లేటెస్ట్ థ్రిల్లర్

By Ravi
On
ఓటిటిలోకి ప్రియదర్శి లేటెస్ట్ థ్రిల్లర్

నేచురల్ స్టార్ నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా తాను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కోర్ట్. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా మరో యువ నటీనటులు హర్ష రోహన్ అలాగే శ్రీదేవిలు మెయిన్ లీడ్ లో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్ట్ థ్రిల్లర్ సాలిడ్ హిట్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. 

ఈ సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఈ సినిమాని ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి బేబి సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నటుడు శివాజీ సాలిడ్ రోల్ ని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకోవాలి.

Advertisement