టారీఫ్ లకు వ్యతిరేకంగా చైనా విదేశాంగ శాఖ!

By Ravi
On
టారీఫ్ లకు వ్యతిరేకంగా చైనా విదేశాంగ శాఖ!


చైనా దిగుమతులపై అమెరికా భారీగా టారీఫ్ లను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్‌లపై చైనా దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. తాము చైనీయులమని.. కవ్వింపు చర్యలకు భయపడే ప్రశక్తి లేదని ఆయన ఓల్డ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అప్పట్లో కొరియా యుద్ధం నేపథ్యంలో చైనా నాయకుడు మావో జెడాంగ్‌ ప్రసంగించిన వీడియో అది. అందులో ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో మేము నిర్ణయించలేం.. అది వాళ్ల ఇష్టం. ఇది ఎంతకాలం సాగినా మేము వెనక్కి తగ్గం. పూర్తిగా విజయం సాధించేవరకు పోరాడతాం అని జెడాంగ్‌ పేర్కొన్నారు. కాగా రోజురోజుకు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది.

చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించారు. కాగా బీజింగ్‌ చర్యపై ట్రంప్‌ మండిపడ్డారు. చైనాకు డెడ్‌లైన్‌ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలపై ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

Advertisement

Latest News

ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..? ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
40 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ సమయంలో మాజీ నక్సలైట్, ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, పలు దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములపై.. స్థానిక ఎమ్మెల్యే మామిడి...
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
సూడాన్‌లో 300 మంది పౌరులు మృతి
ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..