128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్!
ఒలంపిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన క్రీడలు నిర్వహించే అరుదైన గౌరవం. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మళ్లీ ఒలింపిక్స్‌లో చోటు దక్కింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ప్రపంచ క్రీడల్లో క్రికెట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే 2028 ఒలింపిక్స్ కు ఆథిత్యం వహిస్తున్న అగ్రరాజ్యం కసరత్తు స్టార్ట్ చేసింది. టీ20 ఫార్మాట్‌లో పోటీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మొత్తం ఆరు జట్లు పోటీలో పాల్గొంటాయని తెలిపారు. అయితే ఈ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం వహిస్తున్న అమెరికాకు మాత్రం డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో దాదాపు 100 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి.
పురుషుల విభాగంలో ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్, ప్రపంచ క్రికెట్ లోని బలమైన జట్ల ఆధారంగా చూసుకుంటే ఈ టీమ్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. టీ20 ప్రపంచ చాంఫియన్స్ ర్యాంకింగ్‌లో ఇండియా ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. కాబట్టి ఒలింపిక్స్‌కు ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఆస్ట్రేలియా.. ఇది కూడా T20 ఫార్మట్ లో స్ట్రాంగ్ టీమ్ అని చెప్పవచ్చు. దీంతో పాటుగా టీ20 టీమ్స్ లో ప్రపంచ కప్ విజేతలుగా ఉన్న ఇంగ్లాండ్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది.