సూర్య కోసం రంగంలోకి దిగనున్న రజనీకాంత్?

By Ravi
On
సూర్య కోసం రంగంలోకి దిగనున్న రజనీకాంత్?

స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువా మూవీతో డిజప్పాయింట్ చేశారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని భారీగా ప్లాన్ చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తున్న రెట్రోతో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాల్ని పెంచాయి. రెట్రో ప్రపంచ వ్యాప్తంగా మే 1 న రిలీజ్ కు ప్లాన్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 18న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చీఫ్ గెస్టుగా ఇన్వైట్ చేశారన్నది తమిళ సర్కిల్స్‌లో బజ్ నడుస్తోంది. అప్పుడే ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. రెట్రోకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న రెట్రోను స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2D ఎంటర్టైన్మెంట్ పతాకాలపై కార్తీక్ సుబ్బరాజు, సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

సుమారు 65 కోట్లతో నిర్మిస్తున్న రెట్రో డిజిటల్, టెలివిజన్ రైట్స్ సర్ ప్రైజింగ్ రేటుకు సోల్డ్ అయ్యాయన్నది కూడా కోలీవుడ్ టాక్. 80 కోట్లు ఖర్చు పెట్టి ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అలాగే సన్ టీవీ బ్రాడ్ కాస్ట్ రైట్స్ భారీ మొత్తానికి కొన్నట్లు టాక్. రీసెంట్ గా  సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సూర్య లుక్స్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి తీసుకెళుతున్నాయి. ప్రజెంట్ ఫెయిల్యూర్స్‌తో సతమతమతున్న సూర్య, పూజా హెగ్డేలకు ఈ సినిమా హిట్ చాలా ఇంపార్టెంట్. మరీ ఈ సినిమా వీరికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో అనేది చూడాలి.

Advertisement

Latest News

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..! రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్‌ TPN:  సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....
అఘోరీ కోసం పోలీసులు వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి