విశ్వంభర లో బ్యాలెన్స్ ఏంటంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ విశ్వంభర. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటనే విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. విశ్వంభర సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. దీనికి సంబంధించిన ట్రాక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే రెడీ చేశారని తెలుస్తోంది.
అయితే, ఇది మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదనే ఉద్దేశ్యంతో దీన్ని మార్చే పనిలో కీరవాణి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కంపోజిషన్ పూర్తి కాగానే ఈ పాటను షూట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుతో పాటు ఎవరు డ్యాన్స్ చేస్తారనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా జూలై 24న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.