చైనా వాణిజ్యంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు..

By Ravi
On
చైనా వాణిజ్యంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు..

చైనా వాణిజ్య పద్ధతులపై కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనా ఉపయోగించే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను తమ ఆర్థిక వృద్ధికి కారణమవుతుందని అన్నారు. ధరలు, సబ్సిడీలు, కార్మికుల రూల్స్ ఇవన్నీ బీజింగ్ అభివృద్ధికి కారణమవుతున్నాయని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో చైనా తమ ఆధిపత్యాన్ని పెంచుతుందని.. ఇది భారత్ లాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలపై అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. కాబట్టి వెంటనే వీటిపై పరిష్కార మార్గం చూడకపోతే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కోన్నారు. 

ఇక ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సైతం మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ కాలంలో భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వంలోనే అది 25 రెట్లకు పెరిగిందని పీయూష్ ఆరోపించారు. అంతేకాకుండా చైనాతో రాహుల్ గాంధీకి ఒప్పందం ఉందని, అదే భారత్ లోకి వచ్చే చైనా ప్రొడక్ట్స్ పై సుంకాలు భారీగా తగ్గేలా చేశాయని అన్నారు. ఈ కారణంగానే భారత్, చైనాపై ఆధారపడేలా చేసిందని పీయూష్ గోయాల్ అన్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..