ఏఐ వీడియోస్‌పై హైకోర్టులో రేవంత్ సర్కార్ పిటిషన్..!
By Ravi
On
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో ఏఐ సాయంతో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ను సృష్టించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలను సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
Tags:
Latest News
07 Apr 2025 21:50:31
జీహెచ్ఎమ్‌సీ టౌన్ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...