సికింద్రాబాద్‌లో ఏప్రిల్ 21న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులు ఏకమై ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్మండి జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడుతుంది, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యమకారులు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి హాజరుకావాలని వినతిపత్రం ఇస్తూ అలాగే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్లను డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే తెలంగాణ ఉద్యమకారుల హామీలు 250 గజాల ఇంటి స్థలం, 25000 పింఛన్లను అమలు చేయాలని, అలాగే కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డు కలగజేయాలని విన్నవించుకున్నారు, ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తుందని అలాగే వారి విషయాలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గుండు దయానంద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, పి సురేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ, చీమ శ్రీనివాస్ చైర్మన్, ఏ శివకుమార్ నేత కన్వీనర్, డాక్టర్ సి శ్రీనివాస్ చైర్మన్, ఆర్కే భూపాల్, హైదరాబాద్ వైస్ చైర్మన్, కొండ స్వామి జర్నలిస్ట్, జగన్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్, జానకి రెడ్డి వైస్ ప్రెసిడెంట్, జంపాల లక్ష్మణ్ ముదిరాజ్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, తోట భాస్కరరావు కో కన్వీనర్, మామ జాంగిర్ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.