ప్రవీణ్ పగడాల మరణం పై సోషల్ మీడియా దమన నీతిని ఖండిస్తున్నాం-బాబురావు మాజీ పోలీస్ అధికారి
By Ravi
On
ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి పరిచే దిశగా ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం క్రైస్తవ సమాజానికి సంతృప్తికర దిశలోనే విచారణ కొనసాగించడం హర్షనీయమని మాజీ పోలీసు ఉన్నతాధికారి బాబురావు అన్నారు. సోమాజిగూడ,ప్రెస్ క్లబ్లో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో బాబురావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సమాజం ఖండిస్తుంది అని అన్నారు. మృతిచెందిన వారిపై రాక్షస ప్రవృత్తితో సోషల్ మీడియాలో దొంగ వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై ప్రభుత్వము పోలీసు యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెంటనే ప్రవీణ్ పగడాల మృతిపై అందరికీ ఉన్న అనుమానాల నివృత్తికై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Tags:
Latest News
19 Apr 2025 13:40:54
టాలీవుడ్ లో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఓ యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న యాక్టర్స్ లో సుహాస్ కూడా ఒకరు. టాలీవుడ్...