ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజిఆర్ 

By Ravi
On
 ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజిఆర్ 

  • కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెడుతున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ 
  • ఇకపై నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరిస్తా అన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు
  • ప్రతి బుధవారం నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం అవుతానన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
  • పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం
  • ప్రజా సమస్యలు పరిష్కారానికి మొదట ప్రాధాన్యత ప్రజల నుండి వినతలు స్వీకరించిన ఎమ్మెల్యే ఎంజిఆర్ 

TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 02/04/25

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు వారి కార్యాలయం నందు కార్యకర్తే అధినేత సమావేశం కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ మామిడి గోవిందరావు గారు నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టింది.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం అని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉంది.ఇటీవలే కోటి సభ్యత్వలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపద్యంలో కార్యకర్తే అధినేత అని కొనియాడారు.ఈ మేరకు శాసనసభ్యులు వారి కార్యాలయంలో కార్యకర్తలు నుండి మరియు ప్రజల నుండి సమస్యలు పరిష్కార దిశగా వినతల స్వీకరించారు. నియోజకవర్గంలో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని, వారి యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు.పార్టీ సంస్థాగత నిర్మాణం అన్ని విభాగాలు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందిస్తాను.ఈ సమావేశంలో నియోజకవర్గం ఐదు మండలాల నుండి వినతులు వచ్చాయి. నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.*

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!