అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం పంపిణీ

By Ravi
On
అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం పంపిణీ

విజయనగరం

వేపాడ మండలం రాయుడుపేట గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు అండగా రెడ్ క్రాస్ సోసైటి సభ్యులు వంటసామాగ్రి పంపిణీ చేపట్టారు. అగ్నిప్రమాద బాధితులకు వంట సామాన్లు బాక్స్ కార్పన్స్ రగ్గులు ఇతర సామాగ్రిని విజయనగరం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ సభ్యులు ఆధ్వర్యంలో ఎస్ కోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా బాధితులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాములమ్మ, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు టి సూర్యారావు ఎస్ కోట బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ వరలక్ష్మి జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎం.రాము సిహెచ్ మన్మధరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

Advertisement