సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పై శిక్షణ
పార్వతీపురం మన్యం జిల్లా
గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ(CPHC) శిక్షణా పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. వైద్యాధికారులు,సిహెచ్ఓ లకు బ్యాచ్ ల వారీగా నిర్వహించిన రీ ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమంలో మంగళవారం స్థానిక ఎన్జీఓ హోమ్ లో డాక్టర్ జగన్మోహన్ పలు ఆరోగ్య అంశాలపై శిక్షణ ఇచ్చారు. నోటి సంబంధిత వ్యాదులు, చెవి, ముక్కు,గొంతు,దృష్టి సమస్యలు, మానసిక ఆరోగ్యం, రుగ్మతలు,నరాల సంబంధిత వ్యాదులు,వృద్ధుల ఆరోగ్య సంరక్షణ,అత్యవసర ప్రాథమిక వైద్యం పై వివరించారు. పలు రకాల వ్యాదులకు గల మూల కారణాలు, క్షేత్ర స్థాయిలో వాటిని సులభంగా గుర్తించే విధానం,చికిత్స,పర్యవేక్షణ, నివారణ చర్యలపై వివరించారు.ఆరోగ్య కేంద్రాల్లో,క్షేత్ర స్థాయిలో నూ వైద్య సేవలు మరింతగా విస్తృతం చేసి ప్రజారోగ్యం మెరుగుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా పిఎల్. రఘుకుమార్, డా ఎం. వినోద్ కుమార్,కార్యాలయ సిబ్బంది జగన్నాథం,యోగీశ్వరరెడ్డి,సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.