ఎంఎంటీఎస్ ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు

నిందితుడి కోసం నాలుగు బృందాలుగా గాలింపు

By Ravi
On
ఎంఎంటీఎస్ ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు

 

హైదరాబాద్, 24 మార్చి 2025: ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతి పై లైంగిక దాడి ప్రయత్నం చేసిన నిందితుడు జంగం మహేశ్ ను పోలీసులు గుర్తించగలిగారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ ఫోటో ఆధారంగా బాధితురాలు ఆయనపై లైంగిక దాడి ప్రయత్నం చేశాడని గుర్తించింది.

పోలీసుల వివరాల ప్రకారం, మహేశ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని ఫోటోను బాధితురాలికి చూపించడంతో ఆమె మహేశ్ ను గుర్తించింది. మహేశ్ గతంలో గంజాయికి బానిస అయి పాత నేరస్తుడు అని కూడా పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడి కోసం నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ, జంగం మహేశ్ను పోలీసులు గాలిస్తున్నారు.

మహేశ్, ఏడాది క్రితం తన భార్యను వదిలేసిన వ్యక్తి కాగా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవించేవాడు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మహేశ్ ను పట్టుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.

Tags:

Advertisement

Latest News

తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..! తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..!
జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!
ఏఐ వీడియోస్‌పై హైకోర్టులో రేవంత్‌ సర్కార్‌ పిటిషన్..!
అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు