పేట్ బషీరాబాద్: ఫాక్స్ సాగర్ చెరువులో రెండు మృతదేహాలు లభ్యం

By Ravi
On
పేట్ బషీరాబాద్: ఫాక్స్ సాగర్ చెరువులో రెండు మృతదేహాలు లభ్యం

WhatsApp Image 2025-03-24 at 8.48.10 PMహైదరాబాద్, 24 మార్చి 2025: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో రెండు మగ మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువు కట్టపై పాదచారులు 100 డయల్ కు సమాచారం ఇచ్చిన అనంతరం, పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

ప్రాధమిక దర్యాప్తులో మృతుల identities గా ఉమామహేశ్వర్ కాలనీ నివాసితులు నామ్ దేవ్ (45)గా, మరొక మృత దేహం నామ్ దేవ్ మేనల్లుడు బాలాజీగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతులు అర్ధరాత్రి సమీపంలోని బార్ లో మద్యం సేవించి, ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోతుండగా, చీకట్లో దారి తప్పి, బైక్ అదుపు తప్పి చెరువులో పడి మృతి చెందారని తెలిపారు.

ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News