"మీర్పేట్ కార్పొరేషన్ బిజెపి ఆందోళనకు సిద్ధమైంది: ఇంటి పన్నుల తగ్గింపు కోసం రిలే నిరాహార దీక్ష"
హైదరాబాద్ : మీర్పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి మరియు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. గతంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్కి టాక్స్ తగ్గించాలని లెటర్ ఇచ్చిన బిజెపి పార్టీ, ఇప్పుడు ఈ సమస్యపై మరింత అఫెక్టివ్ చర్యలు తీసుకునే ఆలోచనతో రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ కార్యక్రమం మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు 27-03-2025 గురువారం జరగనున్నట్లు బిజెపి అధ్యక్షులు తెలియజేశారు. ఈ నిరాహార దీక్షకు మీర్పేట్ కార్పొరేషన్ లోని అన్ని కాలనీల అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజలు పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట్ మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్ గారు, జిల్లా నాయకులు మద్ది రాజశేఖర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు బిజెపి రాష్ట్ర, జిల్లా మున్సిపల్ నాయకులు పాల్గొననున్నారు.
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ఆందోళనకు ప్రజలంతా స్పందించి పన్నుల పరమార్జన సమస్యపై గమనింపు తీసుకోవాలని పార్టీ నాయకులు కోరారు.