తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను అనుమతించిన ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు
By Ravi
On

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నందుకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారికి, టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ధన్యవాదాలు తెలిపారు.
"ఎమ్మెల్సీగా నేను సిఫారసు చేసిన లేఖలను అనుమతించారు. దీనికి చొరవ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని సిఫారసు లేఖలను అనుమతించిన గౌరవ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని డాక్టర్ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు.
Tags:
Latest News
11 Apr 2025 20:29:06
వరంగల్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించిన జాబ్ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్‌కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట...