గుడివాడ అభివృద్ధికి అందరం కలిసి నడుద్దాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

By Ravi
On
గుడివాడ అభివృద్ధికి అందరం కలిసి నడుద్దాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

రూరల్ మండలం చౌటపల్లిలో ప్రజా వేదిక నిర్వహించిన ఎమ్మెల్యే...

ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకే... ప్రజా వేదిక నిర్వహిస్తున్నాం: ఎమ్మెల్యే రాము

పాలనా దక్షుడు సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే... రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వెళుతుంది:ఎమ్మెల్యే రాము

గుడివాడ రూరల్ మార్చి 21:గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలందరూ పాలు పంచుకోవాలని.... గ్రామాల అభివృద్ధికి అందరం కలిసి నడుద్దామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు.

గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి నేతలతో కలిసి ప్రజల నుండి వినతులను ఆయన స్వీకరించారు. 

ప్రజా వేదికలో వచ్చిన వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము....అధికారులతో మాట్లాడి  పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వినతులు అందించేందుకు వచ్చిన గ్రామస్తులతో ఎమ్మెల్యే రాము ఆప్యాయంగా మాట్లాడారు. 

ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.... నియోజకవర్గ వ్యాప్తంగా కలియతిరిగిన తనకు ప్రజల సమస్యలపై అవగాహన ఉందన్నారు.ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న త్రాగునీటి, రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఆ దిశగా ముందుకు వెళుతూ ఇప్పటికే అనేక గ్రామాల్లో సమస్యలు పరిష్కరించినట్లు ఆయన తెలియచేశారు

సమస్యలను తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని... అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.
అందరూ కలిసి ముందుకు సాగితేనే గత ప్రభుత్వం చేసిన నష్టాల నుంచి బయటపడతామన్నారు.

WhatsApp Image 2025-03-21 at 3.59.40 PMప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాను నిరంతరం అందుబాటులో ఉంటానని... అసెంబ్లీ సమావేశాలు,ప్రభుత్వ కార్యక్రమాలు, లేదా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తాను అందుబాటులో లేకపోయినా ప్రజా వేదిక కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలను తెలియచేయవచ్చనీ ఎమ్మెల్యే రాము అన్నారు. గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు. పాలన దక్షుడు అయిన సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే తిరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళుతుందని ఎమ్మెల్యే రాము పునరుద్గాటించారు.

ప్రజా వేదిక కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, గ్రామ సర్పంచ్ వెలగలేటి రమ్య,ఎండిఓ విష్ణుప్రసాద్, టిడిపి నాయకులు అట్లూరి రమణ ప్రసాద్, వర్రే నాగరాజు, G. రాజేష్ , T. వీర రాజు, బండారు సాయిబాబు, గుమ్మడి రాజు, సూరపనేని నగేష్, వెంకటేశ్వరరావు, పూర్ణచంద్రరావు, యలవర్తి దేశాయ్, అట్లూరి సత్యంబాబు..ఆర్ ఐ నాగబాబు, పంచాయతీరాజ్ AE సూరిబాబు, RWS  AE కిస్మత్ రాణి, అగ్రికల్చర్ AO అనంతలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి V. హరికృష్ణ,దేవి చరణ్,VRO శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..