మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు
- భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మానవ హక్కుల ఫౌండేషన్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు డాక్టర్, బొడ్డపాటి దాసు పేర్కొన్నారు.
- హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సమాచార హక్కు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవ హక్కుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
SK Gani TPN..
గోకవరం:
తూర్పుగోదావరి జిల్లా: మండల కేంద్రం గోకవరం వెలుగు కార్యాలయంలో మానవ హక్కుల ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో మానవ హక్కుల చట్టాల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి, ముఖ్య అతిథులుగా మానవ హక్కుల ఫౌండేషన్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు డాక్టర్, బొడ్డపాటి దాసు, మానవ హక్కుల సంఘ జాతీయ అధ్యక్షులు, డాక్టర్ సిహెచ్, సుమిత్రానందన్, మానవహక్కుల ఫౌండేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కే ఇందిరా, సమాచార హక్కు సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి, ప్రశాంతి, ముఖ్య అతిధులుగా హాజరై వివిధ మానవ హక్కుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు భారత రాజ్యాంగం ప్రతి మానవునికి హక్కు కల్పించిందని అటువంటి హక్కులపై మనం అవగాహన కల్పించుకోవడం ఎంతో అవసరమని సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు మహిళలు పట్ల విపక్ష వంటి అనేక అంశాలపై వారు ప్రసంగించారు .ఈ సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు బత్తిన రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందని రాబోయే రోజుల్లో గ్రామా స్థాయిలో ఈ చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు వాటికి సంబంధించి కమిటీలను నియమించడం జరుగుతుందన్నారు, గ్రామంలో ప్రజలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు, సమస్య పరిష్కారం నిరాకరణ జరిగితే హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు..