శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం

On
శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం

శ్రీహరికోట, జూన్ 16:
శాతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌), శ్రీహరికోటలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు చెన్నై పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. చెన్నై స్టేట్ పోలీస్ సెక్యూరిటీ కంట్రోల్‌కు వచ్చిన ఫోన్ కాల్‌ ద్వారా, ఓ వ్యక్తి షార్‌లో అనుమానంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూశాడని తెలిపాడు. వెంటనే ఈ సమాచారాన్ని నాయుడుపేట డీఎస్పీకి పంపిన చెన్నై పోలీసులు, రాష్ట్ర పోలీసులు మరియు CISF సిబ్బందిని రంగంలోకి దించారు. నిన్న అర్ధరాత్రి నుంచే షార్ పరిసరాల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానితుడు కనిపించలేదని అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షిస్తున్న అధికారులు, ఎలాంటి అనూహ్య పరిణామాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శారులో హైఅలర్ట్‌ కొనసాగుతోంది.