వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు

On
వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని వెటర్నరీ/పెట్ క్లినిక్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో GHMC పరిధిలోని వెటర్నరీ మందుల నిల్వ, విక్రయాల్లో ఉన్న ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 42 మెడికల్ షాపుల్లో వెటర్నరీ మందుల విక్రయానికి సంబంధించి అనేక రకాల ఉల్లంఘనలు గుర్తించారు.
వెటర్నరీ డాక్టర్ యొక్క చట్టబద్ధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా వెటర్నరీ మందులు విక్రయించడం.
కొనుగోలుదారులకు బిల్లు ఇవ్వకుండా మందులు విక్రయించడం. అమ్మిన వెటర్నరీ మందుల కోసం బిల్లులు నిర్వహించకపోవడం మరియు చూపించకపోవడం.రిజిస్టర్డ్ ఫార్మాసిస్టు లేకుండానే ప్రిస్క్రిప్షన్ వెటర్నరీ మందుల పంపిణీ. వెటర్నరీ మందుల కొనుగోలు బిల్లులు చూపించడంలో విఫలం కావడం జరిగింది.  డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం తప్పనిసరి ప్రిస్క్రిప్షన్ / షెడ్యూల్ మందుల రిజిస్టర్లు నిర్వహించకపోవడం.వెటర్నరీ మందుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన బిల్లుల నకళ్ళ నిర్వహణలో లోపాలు.అమ్మే మందులతో పాటు గడువు ముగిసిన వెటర్నరీ మందులు నిల్వలో ఉంచడం.మానవ మందుల నుండి వేరు చేయకుండా వెటర్నరీ మందులను నిల్వ చేయడం జరిగినట్లు తెలుసుకున్నారు. వీరిపై  డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 మరియు అనుబంధ నియమావళుల ప్రకారం, ఈ ఉల్లంఘనలపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Latest News

శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం
శ్రీహరికోట, జూన్ 16:శాతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌), శ్రీహరికోటలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు చెన్నై పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. చెన్నై...
డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు
మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు
వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు
నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్
రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు