కంపుకొడుతున్న గణేష్ నగర్..గండిమైసమ్మ కాలనీలు

On
కంపుకొడుతున్న గణేష్ నగర్..గండిమైసమ్మ కాలనీలు

  • సంవత్సర కాలంగా రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీరు..
  • డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక అవస్థలు పడుతున్న జనాలు..
  • రోగాలతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు..

మేడ్చల్ జిల్లా: దుండిగల్ మున్సిపల్ పరిధి గండిమైసమ్మ, గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2,3 లో డ్రైనేజీ మురికి నీరు అంతా రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పారుతోంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
గత సంవత్సర కాలం నుండి ఈ మురుగు నీటితో అవస్థలు పడుతున్న ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకులేదు. ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది. కానీ సమస్యను తీర్చే నాధుడే లేకుండా పోయాడు. ఇక్కడ జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు మీడియాకు చెప్పుకొచ్చారు. గండి మైసమ్మ గణేష్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే
ప్రధాన కారణం. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురికి నీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో చుట్టూ పక్కల నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికినీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సాయంత్రం అయితే చాలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, అసలే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని అన్నారు. 
దీంతో పాటు రోడ్లపై రాకపోకలు సాగించలేక వాహనదారులు, పాదాచారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.20250616_162612

Advertisement

Latest News

శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం
శ్రీహరికోట, జూన్ 16:శాతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌), శ్రీహరికోటలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు చెన్నై పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. చెన్నై...
డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు
మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు
వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు
నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్
రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు