సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు
By MAHESH ARN
On
హైదరాబాద్: టాలీవుడ్ నటి కల్పిక పై మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు కీర్తన అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, 67 ITA 2000-2008, 79, 356 BNS సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.
కీర్తన ఫిర్యాదు ప్రకారం, కల్పిక ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పదజాలం వాడుతూ దూషించిందని, అలాగే ఇన్బాక్స్ మెసేజ్‌ల ద్వారా అసభ్యంగా మాట్లాడిందని ఆరోపించారు. ఆమె అందించిన స్క్రీన్‌షాట్‌లు ముఖ్యమైన ఆధారాలుగా పోలీసులు స్వీకరించారు.
ఇది కల్పికపై నమోదైన రెండవ కేసు కావడం గమనార్హం. బాధితురాలు చెప్పినట్టు, కల్పిక సోషల్ మీడియాలో స్టేటస్‌ల రూపంలో ఆమెను టార్గెట్ చేయడం, అలాగే ఆన్‌లైన్ వేధింపులు ప్రధానంగా ఉన్నాయని పేర్కొంది.
ప్రస్తుతం పోలీసులు కేసు ఆధారాలపై దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఆరోపణలపై కల్పిక ఇంకా స్పందించలేదు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Latest News
18 Jun 2025 13:00:29
బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. మరికాసేపట్లో పేలిపోతుందని ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ఓ అగంతకుడు కాల్ చేసి బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది...