వక్ఫ్ బోర్డ్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. ఎమ్మెల్యే బలాల
వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాల నాయకులు, మతపెద్దలు ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆధ్వర్యంలో చంచల్ గూడ లోమానవహారం చేపట్టారు. ‘రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం, వక్ఫ్‌చట్టాన్ని తిరస్కరిద్దామని నినాదాలు చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతోపాటు జాతీయ, నల్లజెండాలను చేతబూనారు.భారత రాజ్యాంగం దేశంలోని పౌర సమాజానికి సమాన హక్కులు కల్పించిందన్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ఉన్న భూముల ఆస్తులన్నింటినీ 8.72 లక్షలు గుర్తించి ప్రత్యేక వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని గుర్తు చేశారు.కార్పొరేట్ శక్తులకు ఆస్తులను కట్టబెట్టడమే కేంద్రం లక్ష్యంగా చర్యలు చేపట్టిందని ఆరోపించారు. పార్లమెంటులో అమలు చేసిన బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.