పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం

By Ravi
On
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం

పాత కార్లు ఎక్కడ కనిపించినా తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపే వ్యాపారాన్ని చేస్తూ  సైడ్ బిజినెస్ గా కొనుగోలు చేసినటువంటి కార్ లో ఆయా రాష్ట్రాల్లో తక్కువ ధరలకు లభించే మద్యం బాటిల్లను తీసుకువచ్చి హైదరాబాదులో ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను ఎస్టిఎఫ్ డి టిమ్  సీఐ నాగరాజు బృందం అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన రవీందర్ కత్రావత్ అనే వ్యక్తి తరచూ ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్తూ పాత కార్లను కొనుగోలు చేసి  హైదరాబాదులో ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపే వ్యాపారం చేస్తున్నాడు.  ఢిల్లీ  ప్రాంతాల్లో కొనుగోలు చేసిన కారులో తక్కువ ధరలు కలిగిన మద్యం బాటిల్లను కారు వెనుక డిక్కీలో వేసుకుని హైదరాబాద్ కు తెచ్చేవాడు.  అలా తెచ్చిన 
మద్యం బాటిలను  తన మిత్రుడైన కర్నూల్ కి చెందిన హస్తినాపురంలో ఉంటున్న సంతోష్ మాత కాలనీలో నివాసముంటున్న నాగిరెడ్డికి అందజేస్తాడు. బాటిల్స్ అమ్మగా వచ్చిన లాభాల్లో ఇద్దరూ పంచుకుంటారు. ఈ సమాచారం సేకరించిన ఎస్టిఎఫ్డి టీం సిఐ నాగరాజు తో పాటు ఇతర సిబ్బంది కలిసి నాగిరెడ్డి ఇంటిలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఢిల్లీకి చెందిన 105 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...