అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!
By Ravi
On
చిత్తూరు, శేఖర్ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం మొగిలి అనే గ్రామంలో గున్న ఏనుగు మృతిచెందింది. గత నెలలో వేటగాళ్ల నాటుబాంబు వుచ్చు మూడేళ్ల గున్న ఏనుగు గాయపడింది. ఈ ఏనుగుకు చికిత్స చేయడం కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గాయపడ్డ ఏనుగు గుంపులో ఉన్నట్టుగా ఎలిఫెంట్ ట్రాకర్స్ గుర్తించాయి. కానీ.. అటవీశాఖ అధికారుల మాత్రం సదరు గున్న ఏనుగుకు చికిత్స చేయలేక చేతులెత్తేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆ ఏనుగు ఈరోజు మృతి చెందినట్లు ఫారెస్ట్ డాక్టర్స్ తెలిపారు.