అప్పన్న దర్శనం సర్వపాపహరణం
- సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
గోండు శంకర్, మామిడి గోవిందరావు
TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 01/05/25
సింహాద్రి అప్పన్న దర్శనం సర్వపాపహరణం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు అన్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనాన్ని భక్తులకు ఆలయ అధికారులు బుధవారం కల్పించారు. చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు పుష్పక విమానంలో వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహ స్వామి కనిపించాడని తెలిపారు. ఆ సమయంలో ఆకాశవాణి స్వామి విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని పురూరవుడికి చెబుతుందని వివరించారు. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారని స్పష్టం చేశారు .నరసింహ స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారని వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయ పీఠాధిపతి గణేష్ గురూజీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.