పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
రంగారెడ్డి TPN : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విశ్ర విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు.
43 మంది విద్యార్థులలో 600 మార్కులకు గాను 550 పైన మార్కులను 5 గురు విద్యార్థులు, 500 పైన మార్కులను 20 మంది విద్యార్థులు సాధించారు. 43 కి 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణతో 100% ఉత్తీర్ణత సాధించామని విశ్రా విద్యాసంస్థల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ తెలిపారు
జి. సిద్ధార్థ్ సింహ ఆర్య-600ల మార్కులకు గాను 581, బి. జీవన్ బాలాజీ-577, ఓ. మనోహర్-562, ఎ. మయాంక్- 562, కే దీక్షిత -552, ఏ అక్షిత రెడ్డి-549, జి భాను -548, ఎన్ సచిన్-547, రోహన్ చవాన్-545 మరికొంత మంది ఉత్తమ మార్కులను సాధించారని తెలిపారు. సబ్జెక్ట్స్ వారీగా 'ఏ1' గ్రేడ్స్ వారిగా తెలుగు-15, హిందీ-11, ఇంగ్లీష్-14, మాథ్స్-18, సైన్స్-5, సోషల్-10. వందకు వందశాతం మార్కులను సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. గడచిన 3 సంవత్సరాలలో 2 సార్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ఘనత విశ్రా పాఠశాల విద్యార్థులకు దక్కుతుందన్నారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంధికీ, విద్యార్థులకు, తల్లిదండ్రులకు విశ్రా విద్యాసంస్థల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ, ప్రిన్సిపల్ దూడపాక సురేష్ అభినందనలు తెలియజేశారు.