అజారుద్దీన్ కి భారీ ఊరట..
అజారుద్దీన్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నెక్ట్స్ ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్‌కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. కాగా తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు అజారుద్దీన్.
ఈ క్రమంలో రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా భారత జట్టుకు సేవలందించానని.. దాదాపు పదేళ్లపాటు టీమిండియా కెప్టెన్‌గా ఉన్నానని తెలిపారు. అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అజారుద్దీన్ పేరు తొలగించవద్దని ఆదేశించింది. అయితే తాజాగా వచ్చిన ఈ ఆదేశాలు ప్రకారం అజారుద్దీన్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.