అల్లు అర్జున్22 హీరోయిన్స్ విషయంలో క్లారిటీ?
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ సినిమా AA22xA6 గురించి రోజుకో కొత్త టాక్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్‌లో ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ జోనర్ లో వస్తుంది. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా సాగుతున్నాయి. అయితే, షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, కానీ హీరోయిన్ల సెలెక్షన్స్ గురించి మాత్రం రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ అయిన మృణాళ్ ఠాకూర్, అనన్య పాండే ఫైనల్ అయ్యారని లేటెస్ట్ బజ్ నడుస్తుంది. అయితే వీరిద్దరూ కన్ఫార్మ్ కాదనే మాట కూడా వినిపిస్తుంది.
అట్లీ హై యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ హీరోయిన్ రోల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అనడంలో డౌట్ లేదు. సో దీంతో హీరోయిన్ల సెలెక్షన్ చాలా టఫ్ గా మారినట్లు తెలుస్తుంది. గతంలో ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె పేర్లు వినిపించాయి, వారితో పాటు సమంత, కీర్తి సురేష్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారని ఊహాగానాలు వచ్చాయి. మరి ఈ విషయంలో త్వరలోనే అనౌన్స్ మెంట్ వస్తుందో లేదో తెలియాలి.