మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా

By Ravi
On
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా

మేడ్చల్ జిల్లా: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటేషన్ సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని తెలుసుకున్న బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.బాచుపల్లి మండల అధ్యక్షులు ప్రసాద్ రాజు మాట్లాడుతూ వేతనాలు రాక ఖర్చులకి ఇబ్బంది పడుతున్న కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు.ఈ రోజు సాయంత్రం వరకు కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మీడియా సెల్ కన్వీనర్ సుమన్ రావు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దాసి నాగరాజు,కార్యవర్గ సభ్యులు గజ్జెల్లి సంతోష్ కుమార్ బిజెపి నాయకులుIMG-20250428-WA0144 సురేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్