పాకిస్తాన్ ఆర్మీలో టెన్షన్..

By Ravi
On
పాకిస్తాన్ ఆర్మీలో టెన్షన్..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలిపోతుంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం పాక్ బలగాలు ఇండియా సరిహద్దుల్లోకి వస్తే, బెలూచిస్తాన్‌లో పాకిస్తాన్ తాలిబాన్ల దాడులు తీవ్రమయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ, దాని అధికారులు యుద్ధానికి, దాడులకు ముందే తమ పని చక్కబెట్టుకుంటున్నారు. 

ఈ క్రమంలో, పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ తన కుటుంబాన్ని యూకేకి తరలించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన అనేక మంది అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల్లో యూకే, న్యూజెర్సీలకు పంపారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం బయటకు చెబుతున్నప్పటికీ, భారత్ ప్రతీకార చర్యల్ని ఆపాలని పలు దేశాల సాయాన్ని కోరుతున్నారు. చివరకు, పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి సంబంధించి అంతర్జాతీయ విచారణకు పాకిస్తాన్ సహకరిస్తుందనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. చివరకు నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా తాము ఉగ్రవాదినికి మద్దతు ఇచ్చామని చెప్పుకోవడం గమనార్హం అని అన్నారు.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి