అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్లు..

By Ravi
On
అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్లు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేయబోతున్నట్లు రీసెంట్ గా అఫీషియల్‌ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాగా హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్స్‌తో రూపొందించబోతున్నారు. ఈ సినిమా నెవర్ బిఫోర్ కథగా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయ్యిందట. ఇప్పటికే ఆమె ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా చేసినట్లు సినీ వర్గాల టాక్. 

అల్లు అర్జున్‌తో మృణాల్ ప్రెష్ పెయిర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండనుందట. ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని ఫిల్మ్ యూనిట్ భావిస్తోంది. అంతేగాక, అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ తన కెరీర్‌లో డబుల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి