హైడ్రా అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్‌..!

By Ravi
On
హైడ్రా అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్‌..!

కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు తొలగించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కృష్ణారావు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఐతే.. సభ జరగక ముందే హైడ్రా అధికారులు వాటిని తొలగించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్నా.. అధికారుల కంటికి కనిపించవా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభ జరగక ముందే ఫ్లెక్సీలు తీసేస్తారా అని నిలదీశారు. అధికారులు కాంగ్రెస్‌ పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప పార్టీల కోసం కాదని హితవు పలికారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు వడ్డీతోసహా అప్పజెప్పుతామని హెచ్చరించారు.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి