జడ్సన్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభం..!

By Ravi
On
జడ్సన్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభం..!

ఉన్నత విద్య, గ్లోబల్ కేర్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం అమెరికాలోని జడ్సన్ యూనివర్సిటీ 2025 గాను స్పాట్ అడ్మిషన్స్ అవకాశం కల్పిస్తుందని ఆ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్‌ నిక్కి ఫెనర్ను తెలిపారు. చైతన్యపురిలోని కెరీర్ వింగ్స్ కన్సల్టెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్‌లో లీడింగ్‌లో ఉన్న కెరీర్ ఎడ్యు గ్రూప్.. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. అమెరికాకు చెందిన జడ్సన్ యూనివర్సిటీతో అనుసంధానమై.. స్పాట్ అడ్మిషన్స్ ఈవెంట్‌ను ఏప్రిల్ 26న హిమాయత్‌నగర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టెమ్ ఫోకస్డ్ మాస్టర్స్, డాక్టోరియల్ ప్రోగ్రామ్స్‌లో స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చన్నారు. అప్లికేషన్ ఫీజు, ఐ20 డిపాజిట్స్ కూడా ఉండవన్నారు. 24 గంటల్లో యాక్సెప్టెన్స్, మూడు రోజుల్లో ఐ20 లభిస్తుందన్నారు. సీసీ ప్రెసిడెంట్ స్కాలర్‌షిప్‌తోసహా 9200 స్కాలర్‌షిప్‌ లభిస్తుందని చెప్పారు. ఎలాంటి సందేహాలున్న నేరుగా జడ్సన్‌ యూనివర్సిటీ అధికారుల్ని కలవచ్చన్నారు. జడ్సన్‌ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్లకు డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ అవకాశం కల్పిస్తుందని తెలిపారు. స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్, డాక్టరేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్‌లు ఉంటాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 9052000710, 7995866681 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యూఎస్ఏ కౌన్సిలర్ నవ్య, డైరెక్టర్ ఇర్ఫాన్ అహ్మద్, మార్కెటింగ్ మేనేజర్ అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఇక అదిరిపోనున్న హైదరాబాద్ ఇక అదిరిపోనున్న హైదరాబాద్
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు