పర్యాటకులపై ఉగ్ర చర్య హేయమైనది – శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్ ఆవేదన
CH.SEKHAR TPN
శ్రీకాళహస్తి:జమ్ము కాశ్మీర్‌లోని పహల్గమ్‌లో పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్. కోటేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి హరీష్ రాయల్, అన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పెండ్లిమండపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రతి ఒక్కోరూ సమిష్టిగా పోరాడాలన్నారు.ఇలాంటి దుశ్చర్యలు దేశాన్ని కుదిపేయలేవని మన సైనికుల ధైర్యం, ప్రజల ఐక్యత వాటికి బలమైన సమాధానం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. పాకిస్థానీలు ఇండియాలో ఎక్కడా ఉండకుండా వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిని ప్రపంచ దేశాలు కూడా అమలు చేసి ఉగ్రవాద నిర్మూలనకు భారత దేశానికి సహకరించాలన్నారు. ఉగ్రచర్యలో మృతి చెందిన కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.