రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఆ హీరో గ్రీన్ సిగ్నల్..

By Ravi
On
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఆ హీరో గ్రీన్ సిగ్నల్..

డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ప్రజంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి SSMB29 లాంటి భారీ ప్రాజెక్ట్‌ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మేకర్స్ రూపొందిస్తు్న్నారు. అయితే, రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మహాభారతం సినిమాని తెరకెక్కించాలని ఉందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ఈ ఎపిక్ సినిమాని రూపొందించాలని ఆయన అన్నారు. అయితే, ఇప్పుడు రాజమౌళి ప్రమేయం ఏమీ లేకుండానే మహాభారతం రూపొందనుంది. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే మహాభారత్ ను గ్రాండ్‌ గా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ సినిమాను తాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు.. క్యాస్టింగ్, డైరెక్టర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేదని ఆయన తెలిపారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అమీర్ ఖాన్ స్టార్ట్ చేయనుండటంతో ఈ ఎపిక్ మూవీ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Latest News

అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
అందరికీ అందుబాటులో సులభంగా ఉండే విధంగా భూ భారతి చట్టం తయారు చేయడం జరిగిందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు...
గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య