మంగళవారం బాలాపూర్ శ్రీలక్ష్మీ నరసింహస్వామి గరుడ ప్రసాదం పంపిణీ..!
By Ravi
On
హైదరాబాద్ TPN : బాలాపూర్ చౌరస్తాలో ప్రసిద్ధి గాంచిన శ్రీలక్ష్మినరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22వ తేదీన ఉదయం 9 గంటలకి గరుడ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రసాదం స్వీకరించదలచిన దంపతులు ఉపవాసాలతో సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి రావాలని సూచించారు. ఇకపోతే.. 19వ తేదీ నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 23న స్వామివారి కళ్యాణం జరుగనుంది. భక్తులు అధికసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
Latest News
05 May 2025 11:42:43
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని జన్నయ్యగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హోమంతో పాటు ప్రత్యేక...