చెన్నైకు ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌..?

By Ravi
On
చెన్నైకు ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌..?

చెన్నై సూపర్ కింగ్స్‌ ఐపీఎల్ లో ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడారు. కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే సక్సెస్ అయ్యారు. అంటే నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆరు మ్యాచులు ఉన్నాయి. వాటన్నింటినీ గెలిస్తే సీఎస్కే అకౌంట్ లో 16 పాయింట్లు చేరతాయి. విజయాలు సాధించడంతో పాటు నెట్‌ రన్‌ రేట్‌ ను కాస్త మెరుగుపర్చుకుంటే సీఎస్కేకు తిరుగుండదు. అయితే, టాప్‌ 4 ప్లేస్‌ల కోసం ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది. ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడినా తలుపులు మూసుకుపోవడం ఖాయం. చెన్నై సూపర్ కింగ్స్‌ తన సొంత మైదానం చెపాక్‌ లో మూడు మ్యాచులను ఆడనుంది. 

వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోవడం.. ఫస్ట్ ఎనిమిదిలో ఒకేఒక్క విజయం.. ఇలాంటి టీమ్‌ ప్లేఆఫ్స్‌కు వస్తుందని ఎవరైనా ఊహించగలరా? కానీ, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు అసాధ్యమనుకున్న ఘనతను సాధ్యం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇలాంటి అరుదైన ఫీట్‌ నమోదైంది. అద్భుతంగా పుంజుకొన్న ఆర్సీబీ తాను ఆడిన తొమ్మిదో మ్యాచ్‌ నుంచి 14వ మ్యాచ్‌ వరకు వరుసగా ఆరింట్లో గెలిచింది. టాప్‌ 4లో నిలిచి ప్లేఆఫ్స్‌ కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓటమి పాలైందనుకోండి అది వేరే విషయం. అతి తక్కువగా ఉన్న ఛాన్స్‌లను ఏమాత్రం వదులుకోకుండా వరుసగా విజయాలను నమోదుచేసిన ఆర్సీబీని ఇప్పుడు సీఎస్కే స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి మున్ముందు మ్యాచుల్లో ఏం చేస్తారో చూడాలి.

Advertisement

Latest News

అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
అందరికీ అందుబాటులో సులభంగా ఉండే విధంగా భూ భారతి చట్టం తయారు చేయడం జరిగిందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు...
గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య