కడప జిల్లాలో పిడుగు పడి యువకుడు మృతి..!
By Ravi
On
కడప జిల్లా పెద్దముడియం మండలం చిన్నముడియంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగు పాటుకు దండు బాను ఓబులేసు (24) అనే యువకుడు మృతిచెందాడు. తన పొలంలో కొర్ర పంటకు నీరు కట్టేందుకు వెళ్లినప్పుడు పిడుగు పడటంతో ఓబులేసు మృతిచెందాడు. మృతుడు ఎస్ ఉప్పలపాడులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓబులేసు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Related Posts
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...