రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత
హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారంపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 2.366 కేజీల గంజాయిను ఎస్టిఎఫ్ (STF) పోలీసులు పట్టుకున్నారు.దూల్పేట్ ప్రాంతంలోని పురాణపూర్లో గంజాయి విక్రయం జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా ఎస్టిఎఫ్-ఎ టీం సదరు ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో 1.206 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో చంద్రముఖి మరియు ఆకాశ్ సింగ్‌లను అరెస్ట్ చేసినట్టు ఎస్టిఎఫ్-ఎ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. నిందితులు మరియు గంజాయిని దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.ఇక మరో కేసులో, అసిఫ్‌నగర్ బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్న మహమ్మద్ అఫ్జల్ అమీత్ అనే వ్యక్తిని ఎస్టిఎఫ్-డి టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1.160 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్టిఎఫ్-డి టీం లీడర్ తిరుపతి యాదవ్ వెల్లడించారు. నిందితుడు, మాదకద్రవ్యం కలిపి స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.