శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!

By Ravi
On
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!

శేఖర్‌ TPN , తిరుపతి :

వైసీపీ నేత రోజా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోపాటు ఆయన కుమారుడు మార్క్‌ శంకర్‌ గురించి అనుచిత వ్యాఖ్యల చేయడంపై జనసేన నేతలు భగ్గుమన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం సెంటర్‌లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో రోజా దిష్టి బొమ్మకి చెప్పుల మాల వేసి, ప్యాకేజీ స్టార్‌ అన్నందుకు చెప్పుతో కొట్టి, అనంతరం దాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రోజా కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వినుత కోటా మాట్లాడుతూ.. రోజాకి నగిరి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా.. ఇంకా బుద్ది రాలేదని.. నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి పదే పదే వాగడం సరికాదని హెచ్చరించారు. రోజాని ప్రజలు మరిచిపోయారని, ఎలాగైనా లైమ్ లైట్‌లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఇలాంటి చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతోందని మండి పడ్డారు. ఎంత ప్యాకేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి రోజా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికి దిష్టి బొమ్మని మాత్రమే దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని.. మళ్లీ పవన్ కళ్యాణ్‌పై నిరాధార ఆరోపణలు చేసి, చిల్లరగా మాట్లాడితే నగిరిలో రోజా ఇంటిని ముట్టడించి అక్కడే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కావలి శివకుమార్, పేట చంద్రశేఖర్, తోట గణేష్, చిన్న తోటి నాగరాజు, చంద్రశేఖర్ రావు, లక్ష్మి, రాజ్య లక్ష్మి , నితీష్, వెంకట రమణ యాదవ్ , లక్ష్మణ్ యాదవ్, శీను, వినోద్, లక్ష్మణ్, మహేష్, సురేష్, డుమ్ము, దినేష్ పెద్ద ఎత్తున జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం