బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!
By Ravi
On
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గులాబీ పార్టీ దూరంగా ఉంటోందని ఆరోపించారు. భాగ్యనగర్‌ను మజ్లీస్‌కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్నారు. భాగ్యనగర్‌లో బీఆర్ఎస్‌ను పాతరేస్తామని హెచ్చరించారు. 'కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్‌లారా.. మజ్లీస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లే.. ఓటింగ్‌లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి' అని పిలుపునిచ్చారు.
Related Posts
Latest News
19 Apr 2025 22:02:54
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...