సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!
By Ravi
On
సంగారెడ్డి TPN : బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కంపెనీ గేటు ముందు కుర్చీలో నిద్రిస్తున్న సెక్యూరిటీగార్డ్ ముఖాన్ని టవల్‌తో కప్పి దాడికి పాల్పడ్డారు. అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రథమ చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో పఠాన్ చెరువులోని అమోదా హాస్పిటల్లో చేర్పించారు. ఈ ఘటనపై బీడీఎల్ భానుర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Related Posts
Latest News
19 Apr 2025 22:02:54
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...