మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో, ఇంటి పనులకో రోబోలను మనం చూశాం. ఇక లేటెస్ట్ గా మారథాన్‌లో మనుషులతో పోటీపడే రోబోలు వచ్చేశాయి. చైనాలో జరిగిన హాఫ్, మారథాన్‌లో ఈ రోబోలను మనం చూడొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో చైనా తన ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది.
దీనికి తగ్గట్లుగానే అక్కడ టెక్నాలజీ అడుగులు వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో బీజింగ్ లో యిజువాంగ్ హాఫ్, మారథాన్ ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో 21 కిలోమీటర్లు పరుగులు పెట్టేందుకు వేలాదిమంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీపడ్డాయి. ఈ పోటీకి కొన్ని వారాల ముందే వీటిని పరీక్షించి మరీ బరిలోకి దింపినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. చైనా దేశంలో గతంలో జరిగిన అనేక మారథాన్‌లలో రోబోలు కనిపించాయి. అయితే, మనుషులతో కలిసి పోటీపడటం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో నెటిజన్లు సర్ ప్రైజ్ ఫీల్ అవుతూ.. ఇక మున్ముందు ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందోనని కామెంట్ చేస్తున్నారు.