60 ఏళ్ల వయసులో బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు పెళ్లి..
వెస్ట్ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తాజాగా రింకు మజుందార్ అనే మహిళా నేతను తన 61 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. వారి న్యూటౌన్ ఫ్లాట్‌లో బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు బంధువులు, కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు. దిలీప్ ఘోష్ తెల్లటి కుర్తా, పైజామా ధరించగా, వధువు రింకు ఎరుపు రంగు చీర ధరించింది. దిలీప్ ఘోష్ వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
కాగా బెంగాల్ బీజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్, పార్టీ రాజ్యసభ సభ్యుడు షమిక్ భట్టాచార్య, పార్టీ కేంద్ర స్థాయి నాయకులు సునీల్ బన్సాల్, మంగళ్ పాండే, మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఇతరులు దిలీప్ ఘోష్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి కోరికను తీర్చడానికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని 60 ఏళ్ల దిలీప్ ఘోష్ అన్నారు. అతను ఇప్పటివరకు బ్రహ్మచారి అయినప్పటికీ, ఇది మజుందార్ కి రెండవ వివాహం. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవతున్నాయి.