విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి ఈ సినిమాని మేకర్స్ మే 9 కి ప్లాన్ చేశారు కానీ ఈ డేట్ లో కూడా ఈ సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీనితో ఆల్రెడీ సమంత తన ప్రొడక్షన్ సినిమాని ఆ డేట్ కి లాక్ చేసుకునే సరికి పవన్ సినిమా రావడం లేదు అనే టాక్ మరింత బలపడింది. అయితే ఇపుడు పవన్ విజయ్ దేవరకొండ డేట్ కి రానున్నట్టుగా తెలుస్తుంది.
మే 30న విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ మూవీ కింగ్డమ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ లో వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందట. అది కూడా ఈ మధ్యలో పవన్ ఏమన్నా డేట్స్ ఇస్తే ఆ డేట్ కి మేకర్స్ రావాలనుకుంటున్నారట. లేదా జూన్ కే షిఫ్ట్ అవుతుంది అని తెలుస్తుంది. మరి దీనిపై ఒక క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాయో చూడాలి.