కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
టాలీవుడ్ లో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఓ యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న యాక్టర్స్ లో సుహాస్ కూడా ఒకరు. టాలీవుడ్ లో కమెడియన్ రోల్స్ నుండి హీరో, విలన్ రోల్స్ ను అవలీలగా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న హీరోగా పేరు సంపాదించారు. తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ సుహాస్ ఆకట్టుకుంటారని అనడంలో సందేహం లేదు. ప్రజంట్ ఆయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. కోలీవుడ్ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మందాడిలో సుహాస్ కూడా యాక్ట్ చేయనున్నారు.
దీంతో తన కోలీవుడ్ డెబ్యూ పై మంచి ఆసక్తి ఇపుడు నెలకొంది. ఇక ఈ సినిమాని మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా సుహాస్ తో పాటుగా కట్టప్ప సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ లాంటి నటులు కూడా నటిస్తుండడం విశేషం. మరి ఇలాంటి సినిమాలో సుహాస్ కి ఎలాంటి రోల్ పడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.