ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 29వ సినిమా చేస్తుండగా ఈ సినిమా కోసం అభిమానులు అనౌన్సమెంట్ చేసిన రోజు నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో నీల్ స్టార్ట్ చేయగా కొన్ని రోజుల్లో తారక్ కూడా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు.
మరి గతంలో సలార్ రేంజ్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్ లోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇచ్చేసినట్టు ఇపుడు కూడా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ పోస్టర్ ని అందించనున్నట్టుగా తెలుస్తుంది. ఇలా రానున్న మే నెలలో తారక్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ సహా టైటిల్ కూడా రిలీజ్ ఆరోజే ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అఫిషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.